వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు
వినియోగదారులకు అందుబాటు ధరల్లో దీపావళి టపాసులు
ఏలూరు, మేజర్ న్యూస్: ఏలూరు డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో వట్లూరులోని గోడౌన్ లో ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండే విధంగా దీపావళి క్రాకర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని డిసిఎంఎస్ సీనియర్ అధికారి కృష్ణంరాజు తెలిపారు. డీసీఎంఎస్ గోడౌన్ వద్ద శుక్రవారం పలువురు దీపావళి టపాసుల కొనుగోలుదారులు విలేకరులతో మాట్లాడారు. నగరంలో అన్ని విధాలుగా బయటి మార్కెట్ కంటే డీసీఎంఎస్ లోనే తక్కువ ధరకు నాణ్యమైన దీపావళి క్రాకర్స్ ఉన్నాయని పలువురు కొనుగోలుదారులు అభిప్రాయపడ్డారు. కృష్ణంరాజు మాట్లాడుతూ డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ప్రజలకు తక్కువ ధరలకు దీపావళి టపాసులు అందుబాటులో ఉంచుతున్నామని, లాభాపేక్ష లేకుండా ప్రజాసేవకే ప్రాధాన్య త ఇస్తూ వస్తున్నామని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.