BREAKING
తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి
మోమిన్‌పేట, మేజర్ న్యూస్: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మోమిన్‌పేట మండల పరిధిలోని మొరంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలలను సందర్శించి పట్టభద్రులైన ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరికీ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు కూడా ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని తెలిపారు. 2023 నవంబర్ 1వ తేదీకి ముందు డిగ్రీ పట్టా పొందిన అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో ఫారం-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు పట్లోళ్ల అమరేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు