BREAKING
గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్ రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.!

Select Suryaa Now
అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.!

పటాన్‌చెరు;ఓటరు జాబితాలో గైర్హాజరు, శాశ్వత వలసదారులుగా నమోదైనప్పటికీ,వాస్తవంగా ఓటు హక్కుకు అర్హులైన వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని పటాన్‌చెరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ఏఈఆర్‌వో ) వెంకటేశ్వర్లు తెలిపారు.అర్హులు సంబంధిత డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం తుది ఓటరు జాబితాలో పేరు చేర్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులు,సహాయ ఓటరు నమోదు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు.నియోజకవర్గంలో మొత్తం 1,36,902 మంది ఏఎస్‌డీడీ జాబితాలో ఉండగా, 9,810 మంది మరణించినవారు, 29,676 మంది గైర్హాజరైనవారు, 82,918 మంది శాశ్వత వలసదారులు, 4,918 మంది ఇతరులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాజకీయ పార్టీలు ప్రజలకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు.సమావేశంలో  తహసీల్దార్, సహాయ ఓటరు నమోదు అధికారులు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లు, కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎన్నికల డీటీలు సంతోష్ కుమార్, మహమ్మద్ షఫీ, పటాన్‌చెరు డీటీ లింగశేఖర్ పాల్గొన్నారు.రాజకీయ పార్టీల తరఫున బీఆర్‌ఎస్ నుంచి సుధాకర్ రావు, కాంగ్రెస్ నుంచి శశిధర్ రెడ్డి, టీడీపీ నుంచి నజీర్, బీజేపీ నుంచి రాజేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రశాంత్ హాజరయ్యారు.