నారాయణ పాఠశాలలో చిన్నారుల క్రీడా సంబరం.. ఘనంగా ఎకిడ్స్ ఎన్‌పీఎల్ స్పోర్ట్స్ మీట్
విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు దోహదం
ఖైరతాబాద్ మేజర్ న్యూస్: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ పాఠశాల శాఖలో ప్రిన్సిపల్ కె. కృష్ణవేణి ఆధ్వర్యంలో ఎకిడ్స్ ఎన్‌పీఎల్ క్రీడా సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఆటలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని చిన్నారులకు సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం గోపాల్‌రెడ్డి, ఏజీఎం హేమాంబర్, ఆర్‌ఐ రవిప్రసాద్, ఆర్‌అండ్‌డీ మీనా, కోఆర్డినేటర్ శిరీష, వైస్ ప్రిన్సిపల్ శాలిని, ఏఓ శ్రీశైలం హాజరై విద్యార్థులను అభినందించారు. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, క్రీడా పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల సమగ్ర వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.