కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు
కనిగిరి బిజేపి జడ్పిటీసి మల్లెల గోమ్స్ విజయం
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మండలం కూటమి బలపరచిన బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ 5371 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు .స్థానిక మోడల్ స్కూల్ లో కనిగిరి నియోజకవర్గం జడ్పిటీసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం శనివారం జరిగింది .కనిగిరి మండలంలో 38,933 ఓట్లకు 22,797 ఓట్లు పోలయ్యాయి .బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ 5,371 ఓట్లతో గెలుపొందారు .పోస్టల్ బ్యాలెట్లు 24 రాగా అందులో బిజేపి 17,వైకాపా 2,సిపిఐ 5 వచ్చాయి .ఎన్నికల రిటర్ణింగ్ అధికారి శ్రీనివాస మూర్తి జడ్పిటీసి మల్లెల గోమ్స్ ఎన్నిక నియామక పత్రం అందజేశారు .తనను జడ్పిటీసి గా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఎమ్యెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ,టీడీపి ,జనసేన ,బిజేపి నాయకులు ,మండల ఓటర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు .