BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి : సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి

Select Suryaa Now
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి : సాధారణ పరిశీలకురాలు నాగలక్ష్మి

మైలవరం మేజర్ న్యూస్ : మైలవరం లక్కిరెడ్డి లక్ష్మిరెడ్డి ఇండోర్ స్టేడియంలో శనివారం కొనసాగుతున్న మైలవరం, రెడ్డిగూడెం మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎస్. నాగలక్ష్మి, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ లెక్కింపు బల్లలను సందర్శించి, ఓట్ల లెక్కింపు జరుగుతున్న తీరును పరిశీలించారు. కౌంటింగ్ పర్యవేక్షకులు, సహాయక సిబ్బంది విధుల నిర్వహణ, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, ఓట్ల లెక్కింపు విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెక్కింపు ప్రక్రియలో ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, అధికారులు, ఎన్నికల ఏజెంట్లకు కల్పించిన సౌకర్యాలు, లెక్కింపు గదుల నిర్వహణ తదితర అంశాలను కూడా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి సందేహాలు, అభ్యంతరాలు తలెత్తకుండా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమైన దశ అని, ఈ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశీలకురాలి వెంట విజయవాడ ఆర్డీవో వెన్నెల శీను తదితరులు ఉన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.