BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఎ.ఎస్.డి.డి. జాబితాలో పేరున్నా.. ఓటు హక్కుకు మరో అవకాశం : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

Select Suryaa Now
ఎ.ఎస్.డి.డి. జాబితాలో పేరున్నా.. ఓటు హక్కుకు మరో అవకాశం : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ మేజర్ న్యూస్ : ఓటరు జాబితా నుంచి గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించినవారు, ద్వంద్వ నమోదైనవారు (ఎ.ఎస్.డి.డి.) కేటగిరీల కింద తొలగించబడినప్పటికీ, వాస్తవంగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియలో భాగంగా నవంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందని ఎ.ఎస్.డి.డి. ఓటర్ల జాబితాలు పోలింగ్ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) కార్యాలయాలతో పాటు సంబంధిత వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ద్వారా పాక్షికంగా పూరించిన ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, పాత ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్) నంబర్ ఆధారంగా ఈసీఐనెట్ ద్వారా కూడా ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నివాసం మారని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం-బి ధ్రువీకరణ పత్రాన్ని పూరించి బీఎల్ఓ లేదా ఈఆర్వోకు సమర్పించవచ్చని, ఆన్‌లైన్‌లోనూ అందజేసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలోనే నివాసం మార్చినవారు ఫారం-8 సమర్పించాల్సిన అవసరం లేకుండా ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అనుబంధం-సి, కొత్త చిరునామా ధ్రువీకరణ పత్రాలను నూతన నియోజకవర్గ ఈఆర్వో లేదా ఏఈఆర్వోకు అందజేయాలని సూచించారు. నిరాశ్రయుల విషయంలో బీఎల్ఓ విచారణ నివేదికనే ధ్రువీకరణగా పరిగణిస్తారని వివరించారు. ఇప్పటికే ఫారం-6 సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, దరఖాస్తు ఆమోదం పొందితే వారికి పాత ఎపిక్ నంబరే కేటాయిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించి, నవంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదయ్యేలా చూసుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.