తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : దీపావళి పండుగ సందర్భంగా పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవ శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని విప్ గాంధీ అన్నారు.తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలని ఆకాంక్షించారు.