BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ప్రతి ఇంటా వెలుగులు నిండాలి

Select Suryaa Now
ప్రతి ఇంటా వెలుగులు నిండాలి


- జిల్లా ప్రజలకు మంత్రి అచ్చెన్నాయుడు దీపావళి శుభాకాంక్షలు 
కోటబొమ్మాళి, నవంబరు 7, మేజర్ న్యూస్:
​చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, చీకటిపై వెలుగు సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రతీక దీపావళి పండుగ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వెలుగుల పర్వదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర సంహారాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరిలో సత్యం, ధర్మం, మంచితనం పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ​ఈ పావన పర్వదినం ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని మంత్రి ఆకాంక్షించారు. మన రైతన్నలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, కష్టజీవుల జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని కోరుకున్నారు. మహిళలు, యువత, విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని, పర్యావరణానికి హాని కలగకుండా, అవసరమైన భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలని సూచించారు.