BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ

Select Suryaa Now
దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ

పెనమలూరు మేజర్ న్యూస్ : దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పాటు సురక్షితంగా జరుపుకోవాలని పెనమలూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకట నారాయణ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బాణసంచా కాల్చేటప్పుడు నివాస గృహాలు, వాహనాలు, విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పెట్రోల్‌ బంకులు, ఇతర మండే స్వభావం కలిగిన వస్తువులకు దూరంగా ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే బాణసంచా కాల్చాలి. పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలి. చేతిలో పట్టుకుని బాణసంచా కాల్చకూడదు. వెలగని టపాసుల వద్దకు వెంటనే వెళ్లి పరిశీలించకుండా కొంత సమయం వేచి ఉండాలి. వాటిని తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదు. టపాసులు కాల్చేటప్పుడు నీటి బకెట్లు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. వదులుగా ఉండే దుస్తులు కాకుండా శరీరానికి దగ్గరగా ఉండే పత్తి దుస్తులు ధరించడం మంచిది. కళ్లకు రక్షణగా జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులు కాల్చే ప్రాంతంలో పొగ తాగడం, దీపాలు లేదా ఇతర అగ్నిమూలాలను ఉపయోగించడం చేయకూడదు. కాలిన గాయాలు సంభవిస్తే వెంటనే చల్లని నీటితో గాయమైన ప్రాంతాన్ని శుభ్రపరిచి వైద్య సహాయం పొందాలి. బాణసంచా కొనుగోలు చేసే సమయంలో అనుమతి కలిగిన దుకాణాల నుంచే కొనుగోలు చేయాలి. నాణ్యత, తయారీ వివరాలు లేని టపాసులను కొనుగోలు చేయవద్దు. అధిక శబ్దం, ప్రమాదకరమైన బాణసంచా వినియోగానికి దూరంగా ఉండాలి. రహదారులపై టపాసులు కాల్చి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించకూడదు. బాణసంచా దుకాణాల వద్ద కూడా ప్రజలు క్రమశిక్షణ పాటించాలని, రద్దీ చేయకుండా, దుకాణాల పరిసరాల్లో పొగ తాగకుండా ఉండాలని సూచించారు. దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని కోరారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు ఆదివారం సాయంత్రం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి కొనుగోళ్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. బాణసంచా విక్రయదారులు కూడా సంబంధిత అధికారుల అనుమతులు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని సీఐ ఎన్. వెంకట నారాయణ కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.