BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు

Select Suryaa Now
టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు


విజేతలకు మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం
కోటబొమ్మాళి, నవంబరు 7, మేజర్ న్యూస్:

​స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులు శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. విజేతలను మంత్రి అచ్చెన్నాయుడు శాలువాలతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సందడితో పండుగ వాతావరణం నెలకొంది.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ విజయం ప్రజాప్రతినిధులపై బాధ్యతను మరింత పెంచిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల రూపురేఖలు మార్చేలా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంలో ప్రజాప్రతినిధులు వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు.

​కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల ఐక్యత మరియు క్షేత్రస్థాయి కష్టానికి దక్కిన గుర్తింపుగా ఈ విజయాన్ని అభివర్ణిస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని విజేతలకు మంత్రి అచ్చెన్నాయుడు మార్గదర్శనం చేశారు.