BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం

Select Suryaa Now
ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం

విజయవాడ మేజర్ న్యూస్ : యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, జాతీయ సమగ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు దేశ భవిష్యత్తు నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027 (జాతీయ యువజనోత్సవం) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వికసిత్ భారత్ యువ పార్లమెంట్ జిల్లా స్థాయి పోటీలను నవంబర్ 10న విజయవాడలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడలోని పీఎస్‌సీఎంఆర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరగనున్నాయి. “ఒకే దేశం – ఒకే ఎన్నికలు” అనే అంశంపై యువత తమ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణాత్మక దృక్పథాన్ని సభా వేదికపై వ్యక్తపరిచే అవకాశం కల్పించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన గోడపత్రికలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ జిల్లా అధికారులతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య చర్చల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. పోటీలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలి. నవంబర్ 10న ఉదయం 9 గంటలకల్లా పీఎస్‌సీఎంఆర్ కళాశాల ప్రాంగణానికి చేరుకోవాలి. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారు. రాష్ట్ర స్థాయిలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయిలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకుని ముఖాముఖి సంభాషించే అరుదైన అవకాశం కూడా కల్పించనున్నారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, విధాన నిర్ణయాల్లో యువత భాగస్వామ్యం వంటి అంశాలపై తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ పోటీలు వేదికగా నిలవనున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మై భారత్–ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలకు 9640488813 నంబరులో సంప్రదించవచ్చు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.