BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు

Select Suryaa Now
ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు

ఉయ్యూరు మేజర్ న్యూస్ : ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 21, 17, 31, 30 వార్డుల కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ విజయానికి ముందుండి కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లను రాజేంద్రప్రసాద్ అభినందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మానవసేవే మాధవసేవగా భావించి ఉయ్యూరు పట్టణ ప్రజలకు బాధ్యతతో సేవ చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు చేసే కృషిలో తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ పలియాల రూపాదేవి, 17వ వార్డు కౌన్సిలర్ రామనోళ్ళ శ్రీకాంత్, 30వ వార్డు కౌన్సిలర్ రాజులపాటి ఫణి, 31వ వార్డు కౌన్సిలర్ నేరుసు బాలకృష్ణ, పల్యాల రమేష్, మధు రాజులపాటి, హరికృష్ణ, సూర్య, వీరమ్మతల్లి గుడి కమిటీ సభ్యులు, యాదవ సంఘం నాయకులు, తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.