BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

Select Suryaa Now
డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

విజయవాడ మేజర్ న్యూస్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ఆయన నేతృత్వంలో డీసీపీలు, ఏసీపీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 51 మంది ఎస్‌ఐలతో కలిపి మొత్తం సుమారు 1,123 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించినట్లు వెల్లడించారు. జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల విస్తరించి ఉన్న ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే మార్గాలు, కేంద్రాల వైపు వచ్చే వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాలు, ప్రజలు గుంపులుగా చేరే అవకాశమున్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలను చిత్రీకరిస్తూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా ముగిసేందుకు అహర్నిశలు శ్రమించిన పోలీసు అధికారులు, సిబ్బంది సేవలను పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో నిబద్ధతతో వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించిన జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.