BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్

Select Suryaa Now
జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్

విజయవాడ క్రైమ్, మేజర్ న్యూస్ : నగరంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్త ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్‌) సమీపంలోని దంత వైద్య కళాశాల వద్ద పార్కు చేసి ఉంచిన అంబులెన్స్‌ అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దంత వైద్య కళాశాల గోడకు ఆనుకొని ఉన్న అంబులెన్స్‌లో ఒక్కసారిగా లోపలి నుంచి దట్టమైన పొగలు వెలువడి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వాహనం మొత్తానికి వ్యాపించడంతో అంబులెన్స్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి, దంత వైద్య కళాశాల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు, రోగుల బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటాన్ని గమనించిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.