గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ!
ఎస్.రాయవరం, సూర్య: ఎస్.రాయవరం జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి అమలకంటి రమణమ్మ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పినపాల పద్మావతిపై 13,231 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన కూటమి అభ్యర్థులకు హోం మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. విజయం అనంతరం అమలకంటి రమణమ్మ మాట్లాడుతూ, అంతిమ విజయం ధర్మానిదేనని వ్యాఖ్యానించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. తమ అభిమాన నాయకురాలు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదర్శంగా, తన భర్త ఎస్.రాయవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్దం మార్గదర్శనంలో మండల అభివృద్ధికి కృషి చేస్తానని జడ్పీటీసీ రమణమ్మ హామీ ఇచ్చారు. తన విజయానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్త, నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి వుంటానని రమణమ్మ తమ కృతజ్ఞతలు తెలియజేసారు.