BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి

Select Suryaa Now
కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి

ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : అఖిల భారత విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఓబులశెట్టి వెంకటేశ్వర్లు, కోశాధికారి దుర్గా ప్రసాద్ రాజు, రాష్ట్ర సంఘటనామంత్రి శ్రీనివాసరెడ్డి, విజయవాడ మహానగర కార్యదర్శి పొట్టి శ్రీహరి, సహ కార్యదర్శి కొంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.