చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు
చందానగర్,మేజర్ న్యూస్ : చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతికి దీపావళి పండుగ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ పండుగను ప్రజలందరూ జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జరుపుకుంటారన్నారు. నరకాసురుడనే రాక్షసుడి బారి నుంచి ప్రజలకు విముక్తి కలిగిందని, వారి జీవితాల్లో వెలుగులు నిండాయని, దానికి సూచకంగా ప్రజలందరూ దీపావళిని జరుపుకుంటారని తెలిపారు. ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. దీపావళి పండుగను ప్రజలు జాగ్రత్తలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.