BREAKING
ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం

130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం...

Select Suryaa Now
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం...

                                   బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : నియోజకవర్గ పరిధిలోని 130 మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.31.59 లక్షల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ  వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం కోరుతూ దరఖాస్తు చేసుకున్న అర్హులకు మంజూరైన చెక్కులను మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  గాంధీ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసానిస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ  కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, కోనేరు ప్రసాద్, మరేళ్ల శ్రీనివాస్, పోతుల రాజేందర్, ఎండీ ఇబ్రహీం, యెల్లం నాయుడు, కావూరి అనిల్, మంజుల, లక్ష్మీ అష్రఫ్, సల్లావుద్దీన్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.