దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతికి దీపావళి పండుగ ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. ఈ పండుగను ప్రజలందరూ జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జరుపుకుంటారన్నారు.ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. దీపావళి పండుగను ప్రజలు జాగ్రత్తలను పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు.