ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు
- కార్పొరేటర్ ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావు
ఆరిలోవ, సూర్య: విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సృజన వివాహ వార్షికోత్సవం సందర్భంగా 16వ వార్డు కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగపూడి ప్రతాపరుద్ర ని మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి, గురజాపు మోహన్, వాసు తదితరులు పాల్గొన్నారు.