ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కాకి గంగరాజు
ఆరిలోవ, సూర్య: విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సృజన వివాహ వార్షికోత్సవం సందర్భంగా 14 వ వార్డు కార్పొరేటర్ కాకి గంగరాజు ఎమ్మెల్యే దంపతులను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, ఎమ్మెల్యే దంపతులు మరియు తనయుడు ప్రతాపరుద్ర ను సత్కరించారు. అనంతరం విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగపూడి ప్రతాపరుద్ర తో కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి అధ్యక్షులు ముగడ రాజారావు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.