ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం
పరిగి మండలంలోని ధనాపురం, హొన్నంపల్లి రెండు పంచాయతీలకు కలిపి ఉన్న ఎంపీటీసీ స్థానంలో కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శీరేకోళం రాజగోపాల్ 201 ఓట్ల మెజార్టీతో శనివారం విజయం సాధించారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో), తహసీల్దార్ హసీనా సుల్తానా ఎంపీడీవో అశ్వత్తప్ప ఎంపీటీసీగా గెలుపొందిన రాజగోపాల్‌కు విజయ ధ్రువీకరణ పత్రం (డిక్లరేషన్) అందజేశారు. ఈ కార్యక్రమంలో మారుతి ప్రసాద్, ప్రవీణ్ రెడ్డి నాగభూషణం పాల్గొన్నారు. రాజగోపాల్ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
పరిగి సూర్య రిపోర్టర్ నవీన్.