పలమనేరు రూరల్‌లో టీడీపీ హవా.. జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యం నాగరాజు రెడ్డికి 1,200 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు రూరల్ మండలంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి నాగరాజు రెడ్డి 1,200 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఎంపీటీసీ స్థానాల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు వరుస విజయాలు నమోదు చేశారు. టీ వడ్డూరులో టీడీపీ అభ్యర్థి రామస్వామి, వైసీపీ అభ్యర్థి గణేష్‌పై 322 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెంగరగుంటలో టీడీపీ అభ్యర్థి భువనేశ్వరి, వైసీపీ అభ్యర్థి కిషోర్‌పై 224 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.కూర్మాయిలో టీడీపీ అభ్యర్థి కె. వెంకటరమణ, వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డిపై 105 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొలమాసనపల్లె-1లో టీడీపీ అభ్యర్థి పద్మ, వైసీపీ అభ్యర్థి ఆశారాణిపై 259 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కొలమాసనపల్లె-2లో టీడీపీ అభ్యర్థి మానస, వైసీపీ అభ్యర్థి సునీతపై 499 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బయ్యప్పగారిపల్లె-1లో టీడీపీ అభ్యర్థి రాణమ్మ, వైసీపీ అభ్యర్థి సమీపై 189 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సముద్రపల్లెలో మాత్రం వైసీపీ అభ్యర్థి మల్లిక, టీడీపీ అభ్యర్థి అంజలిపై 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.మరోవైపు మొరం ఎంపీటీసీ స్థానంలో రీకౌంటింగ్ నిర్వహించాలని ఇరు పార్టీల అభ్యర్థులు అధికారులను కోరడంతో అధికారులు తిరిగి ఓట్ల లెక్కింపు చేపట్టారు. బయ్యప్పగారిపల్లె-2 ఎంపీటీసీ స్థానంలోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రెండు స్థానాల ఫలితాలు ఆలస్యంగా వెలువడ్డాయి.మొత్తంగా పలమనేరు రూరల్ మండలంలో టీడీపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా, జడ్పీటీసీ స్థానంలో నాగరాజు రెడ్డి ఘన విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్