BREAKING
నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ!

పామూరు జడ్పీటీసీగా బైరెడ్డి జాహ్నవి రెడ్డి ఘన విజయం

Select Suryaa Now
పామూరు జడ్పీటీసీగా బైరెడ్డి జాహ్నవి రెడ్డి ఘన విజయం

- 19,740 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఆధిక్యం

- జాహ్నవి రెడ్డికి 26,938 ఓట్లు వైసీపీ అభ్యర్థికి 7,198 ఓట్లు

- విజేతగా ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి అఖండ విజయం సాధించి తన సత్తా చాటారు. శనివారం కనిగిరి లోని మోడల్ స్కూల్ లో ఎన్నికల  లెక్కింపు కార్యక్రమం జరిగింది.పామూరు మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి కుమార్తెగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమె 19,740 ఓట్ల భారీ మెజారిటీతో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించారు. ఎన్నికల ఫలితాల్లో బైరెడ్డి జాహ్నవి రెడ్డికి 26,938 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి అంబటి వెంకటసుబ్బమ్మకు 7,198 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి చెప్పిడి వరలక్ష్మికి 102 ఓట్లు లభించాయి. నోటాకు 184 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 34,829 ఓట్లకు గాను 34,422 ఓట్లు పోలయ్యాయి. మరో 407 ఓట్లు తొలగించిన ఓటర్ల జాబితాలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో జాహ్నవి రెడ్డికి వచ్చిన భారీ ఆధిక్యత ఆమె విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ప్రత్యర్థి అభ్యర్థులకు ఏమాత్రం పోటీ ఇచ్చే అవకాశం లేకుండా ఓటర్లు భారీ మెజారిటీతో ఆమెకు పట్టం కట్టారు. దీంతో పామూరు జడ్పీటీసీ స్థానాన్ని కూటమి టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి. శ్రీనివాసరెడ్డి జాహ్నవి రెడ్డిని అధికారికంగా విజేతగా ప్రకటించి డిక్లరేషన్ ఫారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో  టిడిపి నేతలు అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, బైరెడ్డి జయరామిరెడ్డి, ఇవ్వాలి వెంకటేశ్వర్లు బిల్డర్, తహసిల్దార్ లక్ష్మీనారాయణ ఎంపీడీవో బ్రహ్మయ్య, డిప్యూటీ ఎంపీడీవో షేక్ హజరత్ అలీ, సుందరామయ్య, బైరెడ్డి జస్వంత్ రెడ్డి, యాదాల వెంకట సాయి కిరణ్, కంచర్ల శ్రీనివాసులు, అంచూరి వెంకటరెడ్డి,ఇర్రి కోటిరెడ్డి, పిడుగు శ్రీను, ఆర్ ఆర్ రఫీ తదితరులు పాల్గొన్నారు.