BREAKING
నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ!

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయభేరి.. దీపావళి ధమాకా! ప్రజల మద్దతుతో ఘన విజయాలు సాధించాం – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో కూటమి విజయభేరి.. దీపావళి ధమాకా! ప్రజల మద్దతుతో ఘన విజయాలు సాధించాం – ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించి దీపావళి ధమాకా మోగించారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ ఏడాది దీపావళి పండుగ కూటమి శ్రేణులకు మరింత ప్రత్యేకంగా నిలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమకు అపూర్వమైన మద్దతు అందించి మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయాలను కట్టబెట్టారని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాల పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, వారి గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలతో పాటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

 చిత్తూరు అర్బన్ రిపోర్టర్ ,  లవకుమార్