BREAKING
కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు

Select Suryaa Now
కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు

మేడ్చల్, మేజర్ న్యూస్: ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామ ప్రజల తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు కొత్త బోర్లు వేయించడంతో పాటు వాటికి సీఆర్ఐ పంపులను ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్యకు ఉపశమనం లభించనుంది. 23వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్, 14వ వార్డు కౌన్సిలర్ ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ సారా ముత్యాల గౌడ్, సొసైటీ డైరెక్టర్ చంగావుల మధుసూదన్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరావు, మాజీ కోఆప్షన్ సభ్యుడు అక్రమ్ పాషా, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు భావన వెంకటేష్ యాదవ్, డబిల్‌పూర్ శివాలయ టెంపుల్ అధ్యక్షుడు సల్ల వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి మూడు బోర్లు ఏర్పాటు చేయించిన కౌన్సిలర్లు, సహకరించిన నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇదే విధంగా నిరంతరం కృషి చేయాలని కోరారు.