BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు

Select Suryaa Now
తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు  జలమండలి అధికారుల పిలుపు

                       తాగునీటి వృథాపై వాట్సాప్ నంబర్ 99499 30003కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):హైదరాబాద్ నగరంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక చర్యలను ముమ్మరం చేసింది. రాబోయే వేసవిలో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకు చర్యలు చేపడుతోంది.

ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని జర్నలిస్టు కాలనీలో ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించి వసూలు చేశారు.

జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ, ఇంటి నంబర్ 8-2-293/82/J/A/24లో మహమ్మద్ జరీనా బేగం (CAN No. 061112041) పేరుతో ఉన్న నీటి కనెక్షన్‌కు సంబంధించిన ప్రాంగణాన్ని అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వినియోగిస్తోంది. ఈ ప్రాంగణంలో తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు జరిమానా విధించడంతో పాటు మురుగునీటి కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు.