BREAKING
ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం పద్మనాభంలో కూటమి హవా..!! బొలేరో కారు రూఫ్‌లో మద్యం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన

Select Suryaa Now
మెదక్ జిల్లాలో మంత్రి  వివేక్ వెంకటస్వామి పర్యటన

మెదక్: రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భశాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఈ నెల 9వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం నవంబర్ 7న విడుదల చేసింది.పర్యటనలో భాగంగా నవంబర్ 9వ తేదీ ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న మంత్రి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చేరుకుంటారు.నర్సాపూర్ మండలంలో పలు కార్యక్రమాలు: ఉదయం 10 గంటలకు రామచంద్రాపురం గ్రామంలో పశువైద్య ఆరోగ్య శిబిరం, పశుసంపదపై అవగాహన కార్యక్రమంతో పాటు ఎల్‌నినో ప్రభావాలపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.అనంతరం ఉదయం 11 గంటలకు తుల్జారాంపేట గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకం కింద నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.ఉదయం 11.30 గంటలకు నర్సాపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందజేయనున్నారు.మధ్యాహ్నం 12.45 గంటలకు నర్సాపూర్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు.

అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయాలి

మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన వసతి, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కార్యాలయం సూచించింది. అలాగే పోలీసు బందోబస్తు, ఎస్కార్ట్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, మెదక్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.మధ్యాహ్నం 1 గంటకు నర్సాపూర్ నుంచి బయలుదేరి 2.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి చేరుకోనున్నారు.మంత్రి పర్యటనతో నర్సాపూర్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత లభించనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారుల్లో ఈ పర్యటనపై ఆసక్తి నెలకొంది.