BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి

Select Suryaa Now
సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి
  • రావికమతంలో కూటమి జోరు.. 15 స్థానాల్లో టీడీపీ, జనసేన విజయఢంకా
    రావికమతం, సూర్య: ఎన్నికల బరిలో సైకిల్ దూసుకెళ్తుంటే.. దాని వేగానికి బ్రేకులు వేయడంలో వైఎస్ఆర్‌సీపీ విఫలమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రావికమతం మండలంలో కూటమి స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన బలాన్ని నిరూపించుకోగా, మిత్రపక్షమైన జనసేన కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకుని కూటమి విజయానికి మరింత బలాన్ని చేకూర్చింది. మండలంలోని మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేన మూడు స్థానాల్లో బరిలోకి దిగి మూడింటినీ గెలుచుకుని వంద శాతం విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు వైఎస్ఆర్‌సీపీ మొత్తం 20 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఐదు స్థానాలకే విజయం పరిమితమైంది. దీంతో మండలంలో కూటమి 15 స్థానాలతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మూడు  స్థానాల గెలుపుతో వైసీపీకి ఊరట! గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో అధికార పార్టీ హోదాలో  కోల్పోయిన రావికమతం, మరుపాక, తట్టబంద సెగ్మెంట్లలో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది. ఎమ్మెల్యే ప్రచారం చేసినా.. చేజారిన రావికమతం! చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ రావికమతం ఎంపీటీసీ స్థానాన్ని టిడిపి కోల్పోవడం  ఆ పార్టీకి మింగుడుపడని పరిణామంగా మారింది. ఎంపీపీ పీఠం టీడీపీ ఖాతాలోకే! ఇక ముందుగానే ప్రకటించిన ఎంపీపీ అభ్యర్థి రాజాన శ్రీవాణి టి.అర్జపురం-2 ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి విజయం సాధించడం టీడీపీకి మరో సానుకూల పరిణామం. ఎంపీపీ ఎన్నికకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కూటమికి ఉండటంతో శ్రీవాణి ఎంపీపీ పీఠాన్ని అధిష్ఠించడం ఖాయమైంది