andhrapradesh
అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం
- బోని ఎంపీటీసీ ఘన విజయం.... ఎంపీపీగా తాట్రాజు అప్పారావు బాధ్యతలు....!
ఆనందపురం, సూర్య: ఆనందపురం మండలం బోని ఎంపీటీసీ సిగ్మెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తాట్రాజు అప్పారావు ఘన విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైసిపి నాయకుల పై 703 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది ఎంపీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు ఫలితాలు వెలువడగానే ఆనందపురం మండల వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి. కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని తాట్రాజు అప్పారావు కి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాట్రాజు అప్పారావు మాట్లాడుతూ... తన విజయానికి కారణమైన తెలుగుదేశం నాయకులు నాగవంశం డైరెక్టర్ సురాల సత్య వరప్రసాద్ రావు, శిర్లపాలెం సర్పంచ్ కోరాడ గౌరినాయుడు, కర్రీ శ్రీనివాసరావు, శిర్ల అప్పలనాయుడు, రాము నాయుడు, మండల ప్రజలకు, తనకు అండగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు,యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆనందపురం మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతానని అప్పారావు స్పష్టం చేశారు.