పద్మనాభంలో కూటమి హవా..!!
పద్మనాభం, సూర్య: పద్మనాభం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వరాహూరిగా జరిగి చివరకు కూటమి భారీ మెజార్టీని సాధించింది. ఊహించిన దానికంటే కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. మండలంలో ఏ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి అయినా భారీ మెజార్టీతో గెలవడం విశేషం. కొన్నిచోట్ల మాత్రమే అత్యల్ప మెజార్టీతో విజయం సాధించడం జరిగింది.మండలంలోని జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరపు నుండి పోటీ చేసిన కోరాడ సత్యవతి 3110 మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ఈ భారీ మెజార్టీ మండల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.కూటమి ఎంపీపీ అభ్యర్థి కృష్ణాపురం సెగ్మెంట్ నుండి కుచ్చర్లపాటి రామరాజు సతీమణి అరుణ్ కుమారి 605 మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు వైసీపీ ఎంపీపీ అభ్యర్థి గంధవరం నుంచి మురళీ రాజు సతీమణి ఉదయ్ కుమారి విజయం సాధించారు.మండలంలో 15 సెగ్మెంట్లకు గాను 11 కూటమి ప్రభుత్వం గెలుచుకోగా ప్రతిపక్ష పార్టీ నాలుగు స్థానాలకే పరిమితమైంది.పాండ్రంగి వన్, రేవిడి, కోరాడ, బి.ఆర్. తాళ్ళవలస, అయినాడ, తునివలస, కృష్ణాపురం, కొవ్వాడ, బాందేవుపురం, కోరాడ సెగ్మెంట్లతో పాటు మరో సెగ్మెంట్ లో కూటమి ప్రభుత్వం గెలుపొందింది.పాండ్రంగి టూ, అనంతవరం, గంధవరం, రెడ్డిపల్లి సెగ్మెంట్లలో వైసీపీ తన సత్తాను చాటుకుంది. అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ చేసి ఊహించని ఫలితాలను అందించింది.ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికలలో పోటీ చేసిన ప్రతి చోట ప్రతిపక్ష పార్టీ గట్టి పోటీని ఇవ్వడం గమనార్హం. అంతే దీటుగా అధికార పార్టీ తన మార్కును చాటుకుంది.
కొన్నిచోట్ల రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోయినప్పటికీ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చరిష్మా వారిని గెలిపించడం జరిగిందని తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నుండి గెలిచిన అభ్యర్థులను టిడిపి యువ నాయకులు గంటా రవితేజ ప్రత్యక్షంగా కలిసి అభినందనలు తెలిపారు.గంటా అభిమానుల్లో సంబరాలు మిన్నంటాయి.