జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం "
బిజెపి జడ్పిటిసి గా విజయం సాధించిన త్రివేణి.
*జిల్లాలో మొదటి సారిగా పగ్గాలు చేపట్టిన జిల్లా సారధి సతీమణి త్రివేణి.
కొత్తూరు నవంబర్ 07(మేజర్ న్యూస్) పాతపట్నం నియోజకవర్గం లో హిరమండలం జడ్పిటిసి బిజెపి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం సిరిపురం తేజేశ్వరరావు సతీమణి సిరిపురం త్రివేణి మొట్ట మొదటి సారిగా విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టనున్నారు.త్రివేణి 2183 ఓట్లు మెజార్టీ తో విజయం సాధించారు. సిరిపురం జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత
పాతపట్నం నియోజకవర్గం లో కూటమి నేతలు సహకారం తో
హిరమండలంలో బోణీ కొట్టారు. ఈ విజయం జిల్లా బిజెపి కి ఆక్సీజన్ అందించినట్లైంది.జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు చాక చక్యంగా వ్యవహరించి పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చారు.