BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్

Select Suryaa Now
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్

ఉయ్యూరు, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి దార్శనికత, మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై చూపుతున్న ప్రత్యేక దృష్టి, ప్రజా సంక్షేమానికి చేస్తున్న కృషికి ప్రజలు తమ తీర్పు ద్వారా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా ఎన్నికైన బూరెల నరేష్, గిరిడి నీలవేణి, బోనంగి సత్యనారాయణ, పల్యాల శ్రీనివాస్ తదితరులు ఆదివారం రాజేంద్రప్రసాద్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన రాజేంద్రప్రసాద్‌తో పాటు మాజీ సర్పంచ్ యలమంచిలి భ్రమరాంబను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం రాజేంద్రప్రసాద్, భ్రమరాంబ దంపతులు నూతన కౌన్సిలర్లను అభినందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పేదలు, మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఉయ్యూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సాగర సంఘం రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాస్, టీడీపీ నాయకులు తాడు గిరిడి వెంకటేష్, మాదినేని జ్యోతి, మాజీ కౌన్సిలర్ బూరెల రమణ, బూరెల రవి, పల్లె లక్ష్మణ, రెడ్డి రమణ, పల్యాల రమేష్, కన్నారావు తదితరులు పాల్గొన్నారు.



స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.