ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'..
మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
మహిళల సంక్షేమాన్ని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు (తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్) ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి తమ ప్రభుత్వంపైకి పంపించి వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు, ఉపాధిని ప్రభుత్వం వేరే మార్గాల్లో లేదా మరో రూపంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని, అంతే తప్ప మహిళల కోసం అమలు చేస్తున్న ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.