ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు.
కొందుర్గు, (రంగారెడ్డి):
మండల పరిధిలోని చెరుకుపల్లి, గంగన్న గూడెం, కొందుర్గు గ్రామాల్లో 'మా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి' సంబరాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆయా గ్రామాల సర్పంచులు విక్రం రెడ్డి, యాదయ్య , కొందుర్గ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కడిగాళ్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి టపాసులు కాల్చి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులందరికీ మిఠాయిలు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, మాజీ పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి ,సీనియర్ నాయకులు రాములు గౌడ్, కావలి యాదయ్య, ఫహిమొద్దీన్, బి మల్లేష్ గౌడ్, సర్పంచులు విక్రమ్ రెడ్డి, అంజయ్య,యాదయ్య,అమర్నాథ్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ లు రాములు, బి మానయ్య,జీబి కృష్ణ,బోరిగ నరేందర్, బొజ్జిగారి నర్సింలు, దుర్గని శ్రీను ,బోరిగ యాదయ్య, మైపాల్ రెడ్డి,మాదారి నర్సింలు,కావలి లక్ష్మయ్య , అశోక్, గోపాల్, జిల్లెల ప్రవీణ్,అమృతయ్య, శ్రీనువాస్ రెడ్డి, రాకేష్, రమేష్ ,సాయిరెడ్డి,శశి, సత్యనారాయణ రెడ్డి, దర్శన్ ,రామకృష్ణ గౌడ్, అజీమ్,పద్మయ్య, మల్లేష్ బోడ,సాల్వారెడ్డి, రాజు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.