BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు

కొడంగల్: ఒకవైపు దీపావళి పర్వదినం, మరోవైపు జన్మదినం.. ఈ రెండు పవిత్ర సందర్భాలను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో గోరిపల్లి సుమిత్ర-శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ భవనాన్ని ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులైన దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారుని గృహంలోనే ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యంతో సిద్ధం చేసిన విందును స్వీకరించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ధనసరి అనసూయ (సీతక్క), పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు ఈ భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

విందు అనంతరం "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక చిన్నారులతో కలిసి ఆయన బాణసంచా కాల్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన పిల్లలందరికీ ముఖ్యమంత్రి స్వయంగా కలములను (పెన్నులను) బహుమతిగా అందించి అభినందించారు.