BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

Select Suryaa Now
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు

విజయవాడ, మేజర్ న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్పొరేటర్లు, జెడ్పీటీసీలతో కలిసి నాయకులు బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు, నూతన ప్రజాప్రతినిధులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, విజయవాడ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్, పిట్టల గోవింద్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు, పెదపాడు జెడ్పీటీసీ విక్రమ్ కిషోర్, జెడ్పీటీసీ నూతలపాటి బాలకోటేశ్వరరావు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.