BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు

Select Suryaa Now
విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు

విజయవాడ రూరల్, మేజర్ న్యూస్: విజయవాడ రూరల్ మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ నూతలపాటి బాలకోటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన 7,481 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మండలంలోని 40 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 37 స్థానాలను కైవసం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రసాదంపాడు, ఎనికేపాడు, గూడవల్లి, కొత్తపేట, వెలగలేరు తదితర గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ముస్తాబాద్ కెనాల్, పోలవరం జలాలను వినియోగించుకుంటూ జలజీవన్ మిషన్ నిధులతో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు.

మండల పరిధిలోని 14 గ్రామాలు పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో వెస్ట్రన్ బైపాస్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం అవసరమని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికేపాడు వరకు బుడమేరు వరద కాలువ నిర్వహణ, రైల్వే ట్రాక్‌ల వెంబడి డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో దొంకల దారులు, పొలాల బాటలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా అధికారుల సహకారంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తనపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, విజయవాడ రూరల్ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని బాలకోటేశ్వరరావు హామీ ఇచ్చారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ రూరల్, ఎన్టీఆర్ జిల్లా.