కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు.
దర్శి మేజర్ న్యూస్. భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారిని భక్తుల ప్రగాఢ విశ్వాసం.శ్రీ లక్ష్మీ అమ్మవారికి భక్తులు విశేషా అలంకరణ చేశారు. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారికి భక్తులు పూలమాలలతో విశేష అలంకరణ చేశారు. గర్భగుడితోపాటు దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో భక్తులు శోభాయ మనంగాలంకరింపజేశారు. అమ్మవారి భక్తుడు కట్టే కోట హరీష్ ప్రతి ఆదివారం అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరింప చేస్తుంటాడు. దర్శి లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఏడు వేలమందికి అన్నదాన కార్యక్రమం ను నిర్వహించారు.ఇటీవల జరిగిన శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భారీ విరాళాన్ని దేవస్థానానికి అందజేశారు.