కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను ఆదివారం ఉదయం ఈవో వి.కె. శీనా నాయక్ పరిశీలించారు.
శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం, సహస్ర లింగార్చన నిర్వహించే ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ విభాగం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే కార్తీక మాసంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా క్రతువుల విధివిధానాలపై వైదిక కమిటీ సభ్యుడు బి. శంకర శాండిల్యతో చర్చించారు. కార్తీక మాసంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈవో సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.