BREAKING
కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్ 'దిమాగీ నక్సల్స్'తో దేశానికి ముప్పు పొంచి ఉంది: ప్రధాని మోదీ

షాబాద్ రైతులకు మెగా రైతు మేళా సందడి

Select Suryaa Now
షాబాద్ రైతులకు మెగా రైతు మేళా సందడి

 హకీంపేటలో మూడు రోజుల పాటు అగ్రో ఇండస్ట్రియల్ ఎక్స్‌పో… రైతుల తరలింపునకు 9 ప్రత్యేక బస్సులు

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, సహకార శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా దుడ్యాల మండలం హకీంపేట్ గ్రామంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న మెగా రైతు మేళా–2026కు షాబాద్ మండల రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన ఈ మేళాలో ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, వ్యవసాయ యాంత్రీకరణ, అనుబంధ రంగాల అభివృద్ధి, ఆధునిక సాగు పద్ధతులపై ప్రత్యేక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు షాబాద్ మండల రైతుల పర్యటన ప్రారంభం కానుంది. రైతుల రాకపోకల కోసం మండలంలోని వివిధ క్లస్టర్ల పరిధిలో మొత్తం 9 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర తెలిపారు.
షాబాద్ క్లస్టర్‌కు 3, కక్కులూరు క్లస్టర్‌కు 2, మన్మరి, తాళ్లపల్లి, మాచనపల్లి, హైతాబాద్ క్లస్టర్లకు ఒక్కొక్క బస్సు కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని గ్రామాల నుంచి రైతులను మేళాకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు.