సీతారాంపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసిన సర్పంచ్ పావని చెన్నయ్య
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను షాబాద్ మండలం సీతారాంపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ పావని చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పావని చెన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సందర్భంగా గ్రామంలో సందడి నెలకొంది.