జిల్లా కలెక్టర్ నివాసంలో బాలసదనం బాలికలతో దీపావళి సంబరాలు..…
సిద్దిపేట ;దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం బాలసదనానికి చెందిన బాలికలతో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా, ఆనందోత్సాహాలతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి దీపావళి సంబరాలు చేసుకున్నారు.ముందుగా పిల్లలందరితో కలిసి లక్ష్మీ పూజ నిర్వహించి హారతి అందజేశారు. తనే స్వయంగా చేసిన వంటలు, కుటుంబ సభ్యులతో తో కలిసి పులిహోర, అన్నం, కూరలు, సేమియా మరియు మిఠాయిలు పిల్లలకు దగ్గరుండి వడ్డించారు. ప్రార్థన చేసి, ప్రతి ఒక్కటి వదలకుండా తినాలని పిల్లలకు సూచించారు.
అనంతరం పిల్లలతో కలిసి టపాకాయలు కాల్చారు. కలెక్టర్ పిల్లల చేయి పట్టుకూని టపాకాయలు అంటిస్తుంటే పిల్లల ఆనందానికి అవధులు లేకుండా నవ్వులు విరజిల్లారు. టపాకాయల కాంతులు, కేరింతలు, నవ్వుల నడుమ బాలసదనం పిల్లలు ఉత్సాహంగా గడిపారు.ఈ సందర్భంగా బాలికలకు పండుగ కానుకలు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, జీవితంలో ఎంతటి ఓడుదుడుకులు ఎదురైనా కూడా ధైర్యంగా నిలబడి పట్టుదలతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పండుగలను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లే, బాలసదనం పిల్లలతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.