BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి

Select Suryaa Now
మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి

 

కోసమాలలో సలాన రోహిణికి 701 ఓట్ల మెజార్టీ.. పలు ఎంపీటీసీ స్థానాల్లో పసుపు జెండా రెపరెపలు

మెలియాపుట్టి. నవంబర్ 7. మేజర్ న్యూస్..
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో మెలియాపుట్టి మండలంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గణనీయమైన విజయాలు సాధించారు. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యంగా కోసమాల ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి సలాన రోహిణి 701 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మండలంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా ఆమె నిలిచారు.

కోసమాల, వసుంధర, నడసంద్ర గ్రామాల్లో సలాన రోహిణికి లభించిన భారీ ఆధిక్యంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆమె మామ, పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు మెలియాపుట్టి మండలం తో పాటు ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయానికి దోహదపడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు అందుబాటులో ఉంటూ చేపట్టిన కార్యక్రమాలు ఓటర్లను ఆకట్టుకున్నాయని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
. మర్రిపాడు-సి ఎంపీటీసీ స్థానంలో ఎంపీపీ అభ్యర్థి  బైరసింగి దినకర్ గెలుపొందారు. గొప్పిలి నుంచి కే. తిరుపతిరావు, చాపర నుంచి డి. దామోదర్, పట్టుపురం నుంచి ఎస్. వరాలు విజయం సాధించారు.
అలాగే పెద్దలక్ష్మీపురం నుంచి బూర్ల లలితకుమారి, రట్టిని నుంచి సవర వానమ్మ, వెంకటాపురం నుంచి బైరసింగి లలిత, పెద్ద పద్మాపురం నుంచి ఉర్లాన సంపతిరావు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో విజేతల అనుచరులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల్లో ప్రభావం చూపాయని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి ప్రజలు మద్దతు తెలిపారని నాయకులు అభిప్రాయపడుతున్నారు.
మండలంలో పలు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంతో మెలియాపుట్టి టీడీపీకి బలమైన పట్టున్న ప్రాంతంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.