BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి

Select Suryaa Now
ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి
  • గట్టి పోటీ ఇచ్చిన వైకాపా

ఆనందపురం, సూర్య: మండలంలోని ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు పైచేయి సాధించారు. మండలంలోని మొత్తం 17 ఎంపీటీసీ సెగ్మెంట్లకు శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిపి 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాల్లో విజయం సాధించింది.
సెగ్మెంట్ల వారీగా చూస్తే.. ఆనందపురం-1లో వైసీపీ అభ్యర్థి షినగం సుగుణ 555 ఓట్ల మెజారిటీతో, ఆనందపురం-2లో వైసీపీ అభ్యర్థి షినగం 352 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. బోనిలో టీడీపీ అభ్యర్థి తాట్రాజు అప్పారావు 703 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గొట్టిపల్లిలో వైసీపీ అభ్యర్థి ఇల్లాపు అప్పయ్యమ్మ 354 ఓట్ల ఆధిక్యంతో, కుసులవాడలో వైసీపీ అభ్యర్థి ఏవీఎస్ఎస్ ప్రసాదరావు 368 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ముచ్చర్లలో జనసేన అభ్యర్థి షినగం లక్ష్మి 415 ఓట్ల ఆధిక్యంతో, పెద్దిపాలెంలో జనసేన అభ్యర్థి గుండు మురళి 826 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తర్లువాడలో టీడీపీ అభ్యర్థి చందల నారప్ప 465 ఓట్ల మెజారిటీతో, చందకలో టీడీపీ అభ్యర్థి రెడ్డి అప్పలనరసమ్మ 303 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
వేములవలసలో టీడీపీ అభ్యర్థి బంటుపల్లి సత్యవేణి 309 ఓట్ల మెజారిటీతో, గిడిజాలలో వైసీపీ అభ్యర్థి పాండ్రంకి చంద్రకళ 215 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. కణమాంలో టీడీపీ అభ్యర్థి ఆబోతు యమున 98 ఓట్ల మెజారిటీతో, మామిడిలోవలో వైసీపీ అభ్యర్థి గండ్రెడ్డి శ్రీనివాసరావు 108 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పాలవలసలో జనసేన అభ్యర్థి తమ్మిన అప్పలరాజు 395 ఓట్ల మెజారిటీతో, సొంట్యంలో వైసీపీ అభ్యర్థి గొలజాన రవికుమార్ 56 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వెల్లంకిలో జనసేన అభ్యర్థి అక్కరబోయిన సాయి శ్యామల 228 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గంభీరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఇల్లిపిల్లి రమణ నాలుగు ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా 17 ఎంపీటీసీ స్థానాల ఫలితాల్లో వైసీపీ ఏడు, టీడీపీ ఆరు, జనసేన నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు 10 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధించారు. రిటర్నింగ్ అధికారి ఆర్. పూర్ణిమ దేవి, ఎంపీడీవో బి. సత్యనారాయణ, తహసీల్దార్ శ్రీనుబాబు సమక్షంలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏడీసీపీ రమ్య, ద్వారక ఏసీపీ మల్లేశ్వరరావు, నార్త్ ఏసీపీ అప్పలరాజు, స్థానిక సీఐ ఎర్రన్నాయుడు నేతృత్వంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.