BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం

Select Suryaa Now
టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం

 

21 ఎంపీటీసీ స్థానాలకు 18 స్థానాల్లో టీడీపీ జయకేతనం – 3 స్థానాల్లో వైసీపీ విజయం

టెక్కలి మేజర్ న్యూస్:07 నియోజకవర్గంలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం లభించింది. స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

నియోజకవర్గ పరిధిలో జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి టెక్కలిలో రేయి ప్రీతీష్ చంద్ర 12,791 ఓట్ల మెజారిటీతో, సంతబొమ్మాళిలో పి. పద్మ 13,694 ఓట్ల మెజారిటీతో, నందిగాంలో పోలాకి చంద్రశేఖరరావు 13,528 ఓట్ల మెజారిటీతో, కోటబొమ్మాళిలో పూజారి శైలజ 19,872 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

టెక్కలి మండలంలో ఎంపీటీసీ ఫలితాలు ఇలా ఉన్నాయి:

టెక్కలి-1 బగాది రమాదేవి, టెక్కలి-2 మామిడి ప్రసన్న కుమారి, టెక్కలి-3 దవల ఈశ్వరి భాయ్, టెక్కలి-4 నాగళ్ల మోహిని, టెక్కలి-5 సోడిమూడి కిరణ్ కుమార్, టెక్కలి-6 కోళ్ల కామేష్, టెక్కలి-7 ఋణ జినా, టెక్కలి-8 కిల్లానా సునీత, తొలుసూరుపల్లిలో మంచాల సింహాచలం, నరసింగపల్లిలో పొట్నూరు సూర్యనారాయణ, అయోధ్యపురంలో పోలాకి రమణమ్మ, చాకిపల్లిలో పేరా భారతి, ఆర్.ఎస్. నౌపడలో పరపటి వెంకటరత్నం, అక్కువరంలో ఎజ్జల నేలవేణి, బూరగంలో జనపాన రూపవతి, తిర్లంగిలో ముద్దాడ శాంతారావు, రావివలసలో నర్తు కృష్ణారావు టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు.
అదేవిధంగా లింగాలవలసలో గురువెల్లి కమలాకర్, పోలవరంలో బగాది రేష్మ, తలగాంలో పేడాడ సమీరా, మేఘవరంలో సంపత్తి రావు అరుణ వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు.

మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, మిగిలిన నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో టెక్కలి మండలంలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.
కౌంటింగ్ ప్రక్రియను జిల్లా అధికారులు పర్యవేక్షించగా, తొమ్మిది మండలాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, పోలీసు సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు విధులు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.