BREAKING
ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం పద్మనాభంలో కూటమి హవా..!! బొలేరో కారు రూఫ్‌లో మద్యం స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు

Select Suryaa Now
పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం  678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు

 

పాములపాడు, మేజర్ న్యూస్: పాములపాడు మండల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై 678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో వెలువడిన ఫలితాలతో జైపాల్ విజయాన్ని అందుకున్నారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై స్పష్టమైన ఆధిక్యత సాధించి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 678 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు జైపాల్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. పాములపాడు జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వేల్పుల జైపాల్ విజయం మండల రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.