ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత
పలమనేరు మేజర్ న్యూస్ పలమనేర్ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి దంపతులను చిత్తూరు మేయర్ గా ఎన్నికైన కటారి హేమలత శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చిత్తూరు మేయర్ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచి 34,116 ఓట్ల మెజారిటీ సాధించిన ఆమె విజయం అనంతరం ఎమ్మెల్యే అమర్ దంపతులను వారి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను ఆమె దుస్సాలువతో సన్మానించగా వారు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్