BREAKING
ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి!

బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి, అమేయ పూజారి

Select Suryaa Now
 బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి, అమేయ పూజారి

సూర్య సిటీ బ్యూరో, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి మరియు ఆయన కుమారుడు అమేయ పూజారి అధికారికంగా పార్టీలో చేరారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు గీతా మూర్తి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత ఎన్. రాంచందర్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానాలను చూసి వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఎన్. రాంచందర్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యాపార, వాణిజ్య వర్గాలలో సరికొత్త విశ్వాసాన్ని నింపాయని ఆయన చెప్పారు. అనంత్ పూజారి వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు పార్టీలో చేరడం వల్ల పార్టీ బలం మరింత పెరుగుతుందని, ఆయన సేవలను పార్టీ విస్తరణకు సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వం, దేశాభివృద్ధికి బీజేపీ చేస్తున్న కృషికి ముగ్ధులమై తాము పార్టీలో చేరుతున్నట్లు వ్యాపారవేత్త అనంత్ పూజారి వెల్లడించారు. పార్టీ అప్పగించే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.